భారతీయ జనతా పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. రాష్ట్రంలో పార్టీని బలంగా చేయడం ముఖ్య నాయకులకు బాధ్యత అప్పగించింది. ఈ మేరకు మంగళవారం రాత్రిని జిల్లాలకు అధ్యక్షులు నియమిస్తూ జారీ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలను నిర్వహించిన బీజేపీ అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలియజేశారు. బిజెపి జిల్లాల వారిగా నియమించిన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, అల్లూరి సీతారామరాజు జిల్లా(అరకు) మఠం శాంతకుమారి, శ్రీకాకుళం జిల్లా సిరిపురం తేజేశ్వరరావు, విజయనగరం జిల్లా ఉప్పలపాటి రాజేష్ వర్మ, విశాఖపట్నం జిల్లా మంతెన పరుశురామ్ రాజు, అనకాపల్లి జిల్లా ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, కాకినాడ జిల్లా బిక్కిన విశ్వేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అడబాల సత్యనారాయణ, తూర్పు గోదావరి జిల్లా పిక్కి నాగేంద్ర, పశ్చిమ గోదావరి జిల్లాకు ఐనంపూడి శ్రీదేవి, ఏలూరు జిల్లా చౌటపల్లి విక్రమ్ కిషోర్, ఎన్టీఆర్ జిల్లాకు అడ్డూరి శ్రీరామ్, గుంటూరు జిల్లాకు చెరుకూరి తిరుపతిరావు, పల్నాడు జిల్లాకు యేలూరి వెంకట మారుతి శశి కుమార్, ఒంగోలు జిల్లాకు సెగ్గం శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకు శ్రీపారెడ్డి వంశీధర్ రెడ్డి, తిరుపతి జిల్లాకు సామంచి శ్రీనివాసరావు, అన్నమయ్య జిల్లాకు వసంత సాయి లోకేష్, చిత్తూరుకు సూరపనేని జగదీశ్వర్ నాయుడు, కడప జిల్లాకు జంగిటి వెంకట సుబ్బా రెడ్డి, సత్యసాయి జిల్లాకు గోరంట్ల మోహన్ శేఖర్, అనంతపూర్ జిల్లాకు కొనకొండ్ల రాజేష్, కర్నూలు జిల్లాకు బాపురం రామకృష్ణ పరమహంస, నంద్యాల జిల్లాకు అభిరుచి మధును అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రకటించింది. ఈ నియామకాలు పట్ల పార్టీ నేతలు హర్షణ వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షులుగా ఉన్న నేతలంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని పార్టీ అధిష్టానం సూచించింది.
లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. బహిరంగంగా మాట్లాడొద్దంటూ నేతలకు హితవు.!
ఆరోగ్యకరమైన పళ్ల కోసం ఈ ఆహార పదార్థాలు ట్రై చేయండి..