ప్రముఖ హీరో నాగశౌర్య(నాగ శౌర్య)కి గత కొంత కాలం నుంచి సరైన హిట్ సినిమాలు లేవు.2018 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఛలో’ మూవీతో పాటు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ మాత్రమే నాగ శౌర్య కి విజయాన్నిఅందించిపెట్టాయి.కానీ ఈ మధ్యలో వచ్చిన అన్ని చిత్రాలు కూడా పరాజయాన్ని చవి చూశాయి.నాగశౌర్య తన క్యారక్టర్ కోసం కష్టపడి నటించడంతో పాటుగా, వేటికవే భిన్నమైన సినిమాలు అయినా కూడా కథనాల్లోని లోపాల వల్ల సక్సెస్ ని చూడలేకపోయింది.కానీ ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..
ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు.ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘బాడ్ బాయ్ కార్తీక్’ అనే వినూత్నమైన టైటిల్ ని ఫిక్స్ చేయడం జరిగింది.ఈ మేరకు మేకర్స్ టైటిల్ పోస్టర్ ఒక దాన్ని రిలీజ్ చేసారు.సీరియస్ లుక్ తో ఉన్న నాగశౌర్య పోస్టర్ అయితే ఇప్పుడు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది.సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు.
పక్కా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి రామ్ దేసిన(రామ్ దేశిన)దర్శకుడు కాగా వైష్ణవి ఎంటర్ టైన్ మెంట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ రాజ్ ఈ సంగీతాన్ని అందించారు.హీరోయిన్ తో పాటు మిగిలిన నటి నటుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.