- మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ముద్ర.వనపర్తి :- రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్, కాస్మెటిక్ చార్జీలను భారీగా పెంచిందని, కాబట్టి వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారులు బాలికల వసతి గృహ బస చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు వనపర్తి జిల్లాకు ప్రత్యేక అధికారిగా మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా బుధవారం జిల్లా గ్రామీణ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా ఐ డి ఓ సి కి వచ్చిన అధికారికి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ అదనంగా జి వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు.
గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో కామన్ డైట్ మెనూ అమలు చేస్తున్నారా లేదా అని ప్రిన్సిపల్ ను ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వసతి గృహంలో వంటగది, వంట సామాగ్రి భద్ర పరిచే గదిని పరిశీలించారు. వంట సామాగ్రికి సంబంధించి స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందించే మెనూ గురించి ఆరా తీశారు.
ప్రత్యేక అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో వెచ్చిస్తోందని.. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు 40 శాతం మెస్ చార్జీలు, దాదాపు 200 శాతం కాస్మటిక్ చార్జీలు ప్రభుత్వం పెంచుతున్నట్లు చెప్పారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆఫ్జాలుద్దీన్, ఉద్యాన శాఖ అధికారులు, గిరిజన సంక్షేమ పాఠశాల ప్రిన్సిపల్ సరస్వతి, కొనసాగుతున్నారు.
The post వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలి … appeared first on Mudra News.