సమాజంలో అందరూ బాగుండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇన్ని పార్టీలు లేవన్నారు. ఆయనకు అధికారం త్వరగా వచ్చింది. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. వందల వేల కోట్లు లేకపోయినా సంకల్పబలంతో పార్టీని నడుపుతున్నాం.
జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేనెప్పడూ అనలేదు. నేను ఒక కులానికి నాయకుడిని కాను అన్నారు. నాకు అంత త్వరగా అధికారం వస్తుందని అనుకోవడంలేదు. గజమాల వేస్తే నేను సీఎం కాలేను. హారతులు ఇస్తే నేను సీఎం కాలేను. ఓట్లు వేస్తే సీఎం అవుతానన్నారు.