ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం నీవి అధికారులు వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్, రేర్ అడ్మిరల్ రవ్ నిష్ సేత్ లు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వార్థం పలికారు. ఆలయంలో వారి ప్రత్యేక పూజలు జరిగాయి. దర్శనానంతరం ఆశీర్వచన మండపం వద్ద వేదపండితులు వేదాశీర్వచనం గావించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కర్ రావు శ్రీ స్వామివారి ప్రసాదం, ఫోటో ప్రదేశం.
ఈ సందర్బంగా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్ మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రమును దర్శించి శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందడం పూర్వజన్మ సుకృతముగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. మాడవీధులు ఆలయ పరిసర ప్రాంతములు తిరిగి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆలయ విశిష్టతను, పునర్నిర్మాణ వివరాలు ఈఓ భాస్కర్ రావు నేవి అధికారులకు వివరించారు. ఆలయ నిర్వహణ తీరు పట్ల నీవి అధికారులు భాస్కర్ రావు, ఆలయ అధికారులను అభినందించారు .