మొగుళ్ళపల్లి, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క అంజలి (18) అనే యువతి సెప్టెంబర్ 28న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.. చూసిన ఇంటి పొరుగువారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న అంజలి అక్టోబర్ 3న రాత్రి 8 గంటలకు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు, గ్రామస్తుల కథనం ప్రకారం పోలీసులు మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన చెక్క రాజయ్య అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కలరు.
ఆయన చిన్నబిడ్డ అంజలి ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకుని, ఇంటి దగ్గరే నివాసం ఉంటున్న తరుణంలో అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేదని, దీంతో తండ్రి రాజయ్య ఆర్ఎంపి డాక్టర్ వద్ద వైద్యం చేయించేవారని, ఈ మధ్య కొంత కాలం నుంచి సంబంధికులు అంజలికి పెళ్లి సంబంధాలు చూడటం తరుణంలో..మృత్యురాలికి పెళ్లి లేక కడుపునొప్పి. భరించలేక మనసులో బాధపడి జీవితంపై విరక్తి చెంది సెప్టెంబర్ 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం పూట పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు అంజలి నురుగులు కక్కుతుంటే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్న అంజలి అక్టోబర్ 3న రాత్రి 8 గంటలకు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని, మృతురాలి చెక్క రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జాడీ శ్రీధర్ తెలిపారు.