ముద్రణ వార్తలు, ఆంధ్రప్రదేశ్: ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న వేళ… బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగానే ఇద్దరు కానిస్టేబుళ్లు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్ల చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీ సమయంలో రొళ్ల పీఎస్ కు చెందిన నారాయణస్వామి నాయక్, ఆగళి పీఎస్ కు చెందిన శివకుమార్ బహిరంగంగా ప్రజలంతా చూస్తుండగానే కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.