అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు కుట్ర కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. నిందితుడు సాయి వర్షిత్‌ను ఫెడరల్ కోర్టులో హాజరుపరిచిన అమెరికా పోలీసులు. వచ్చే మంగళవారం వరకు అతన్ని జైల్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు అమెరికా పౌరుడు కాదని పోలీసులు తెలిపారు. అతను గ్రీన్‌కార్డు హోల్డర్ అని కోర్టుకు వివరించారు. విచారణలో సాయి వర్షిత్ కుటుంబానికి ఇబ్బందులు కలిగించబోమని పోలీసులు తెలిపారు. తనకు నాజీలు, హిట్లర్ అంటే అభిమానమని అతను చెప్పాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యమని అన్నాడు. తాను వైట్‌హౌస్‌లోకి వెళ్లలేకపోయినా తన సందేశం అందరికీ చేరిందని అన్నాడు. యూ–ట్రక్కును రెంట్‌కు తీసుకొని ఇతను వైట్‌హౌస్ వద్దకు వెళ్ళాడు. ట్రక్కు బారికేడ్లను ఢీకొట్టగానే సంతోషంతో నాజీ జెండా ఎగరేశాడు.