ముద్ర, సెంట్రల్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెళ్లు సునీత, షర్మిలకు కడప జిల్లా కోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడొద్దని కడప కోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం విధితమే. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇటీవల వివేకానంద రెడ్డి కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించిన కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైఎస్ సునీత కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన మేరకు గతంలో ఇచ్చిన తీర్పుపై కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు చివరికి వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ. 10 వేలు జరిమానాను కూడా కడప కోర్టు విధించింది. ఈ జరిమానాంటూ కడప లీగల్ సెల్ కు కట్టాల కోర్టు కోర్టు ఆదేశించింది.