ఆ పర్యటనకు అనుమతిని ఇవ్వొద్దంటూ కోర్టును కోరిన సీబీఐ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వరాదని కోర్టును కోరుతూ సీబీఐ షాకిచ్చింది. ఈనెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సివుందని, ఈమెరకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సమయంలో, జగన్ విదేశీయుడికి అనుమతి ఇవ్వరాదంటూ సీబీఐ కోర్టును కోరింది. జగన్ పై వున్న మొత్తం 11 కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోందని, ఇందులో ప్రతి కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. మే 15న జగన్ పై వున్న ప్రధాన కేసు విచారణ జరగనుందని కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ నేపథ్యంలో జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతిని ఇవ్వడం సరికాదని. దీనితో న్యాయస్థానం ఈ కేసులో తీర్పును 14కి వాయిదా వేసింది.