ముద్ర,తెలంగాణ:- కాంగ్రెస్ “ఇందిరమ్మ రాజ్యం…. ఇంటింటా సౌభాగ్యం“పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ దీపాదాస్ మున్షీభవన్లో ఈ మేనిఫెస్టోను ఆవిష్కరిం చారు.ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఉన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు ఇవే..
- అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
- మేడారం జాతరకు జాతీయ హోదా
- గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రారంభం
- భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేసింది
- 4 సైనిక పాఠశాలలు ఏర్పాటు
- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు
- కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చూడటం
- సౌరశక్తి ఉత్పత్తి
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం
- రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
- రామగుండం-మణుగూరు కొత్త రైల్వే లైను ఏర్పాటు
- రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు