- ఏపీలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడి
- ఏపీలో ఉదయం 11 గంటలకు 23.10 శాతం పోలింగ్
- ఆ తర్వాత మరో రెండు గంటల్లోనే 36 చేరిన వైనం
- ఈసారి ఏపీలో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశ’ముంద’ని ఈసీ అంచనా
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీ, తెలంగాణాలో నమోదైన పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీలో 36 శాతం, తెలంగాణాలో 40 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ విడుదల. ఇక ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం గంట గంటకు పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒకటి వరకు 36 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తొలి మూడు గంటలు మందకొడిగా సాగిన పోలింగ్ ఉదయం 11 గంటల తర్వాత పుంజుకుంది.
ఏపీలో ఉదయం 11 గంటలకు 23.10 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత మరో రెండు గంటల్లోనే 36 చేరింది. చాలా చోట్ల భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నరసరావుపేటలో 27.14, గురజాలలో 24.31, సత్తెనపల్లిలో 23.63, వినుకొండలో 24.83 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 79.84 శాతం పోలింగ్ నమోదైన విషం. ఈసారి 83 శాతం పోలింగ్ జరిగే అవకాశముందని ఈసీ అంచనా వేసింది. ఎన్నిక అధికారి ముఖేష్‌కుమార్ మీనా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.