ఉండవల్లి, ముద్ర : అనంతపురానికి చెందిన వైసీపీ ముఖ్యనేతలు యువనేత నారా లోకేశ్ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు లోకేశ్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి చంద్రబాబునాయుడు ఏర్పాటు పనిచేయడానికి వచ్చే వారందరికీ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని లోకేశ్ అన్నారు.
జగన్ విధ్వంసక పాలనతో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. అనంతపురంలో పార్టీ విజయానికి కృషిచేయాలని, అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపునిస్తామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో అనంతపురం నగర వైసీపీ మాజీ అధ్యక్షుడు జయరాం నాయుడు, అనంతపురం రూరల్ మాజీ ఎంపీపీ మలత, అనంతపురం రూరల్ సర్పంచ్ ఉదయ్, ఎంపీటీసీ జ్యోతి, 12వ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫకృద్దీన్, 23వ డివిజన్ కార్పొరేటర్ హరిత, మార్కెట్ యార్డు డైరక్టర్ గోవిందు, అనంతపురం రూరల్ నాయకులు శ్రీరాములు, సుధాకర్, నారాయణస్వామి, షేక్ షావలి, రమణ, లక్ష్మీదేవి, జయ బూన్ బీ, ఫిరోజ్, మల్ రాయుడు, పల్లవి, నాయుడు, శశాంక్ రాహుల్, రామ్మోహన్, చంద్ర, ప్రవీణ్ ఉన్నారు.