మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా గేమ్ చేంజర్ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక అప్పటినుంచి మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఒక పక్క ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ కల్కి, అల్లు అర్జున్ పుష్ప 2 లు సినీ మార్కెట్ లో సందడి చేస్తున్నారు. దీనితో మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ విషయంలో డల్ గా ఉన్నారు. ఈ టైం లో తమన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి
గేమ్ ఛేజర్ కి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ జరగండి సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఆయన గేమ్ చేంజర్ గురించి మాట్లాడటం మూవీలోని సాంగ్స్ అన్నీ సూపర్ గా ఉంటాయి. అలాగే మూవీ కూడా పక్కా బ్లాక్ బస్టర్.ప్రతి అంశం హైలైట్ గా ఉంటుంది. శంకర్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత తన మార్క్ కమర్షియల్ తో వస్తున్నారు. ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ రాబోతుంది. ఇది నా ప్రామిస్ అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పాడు
ఇప్పుడు తమన్ చెప్పిన ఈ మాటలతో మెగా ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది. శంకర్ ఓల్డ్ మూవీస్ జెంటిల్ మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు,సినిమాలు ఎంతగా ఘన విజయం సాధించాయో అందరకీ తెలుసు. విజయం సాధించడమే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతుండగా అంజలి, శ్రీకాంత్, ఎస్ జె సూర్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు అత్యంత భారీ వ్యయంతో ఉన్నాడు. ఆయనకిది 50 వ సినిమా. చరణ్ ప్రస్తుతం తన వైఫ్ ఉపాసన, కూతురు క్లీంకార తో కలిసి మస్కట్ లో ఉన్నాడు