ఒంగోలు: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గతంలో ఆరోపణలు చేసిన వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కలిగి ఉన్నాడంటూ ఒంగోలులోని మంగమ్మ కళాశాల వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒంగోలు తాలూకా పీఎస్‌లో విచారిస్తున్నారు. తాజాగా బాలినేని, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిపై గుప్త విమర్శలు చేస్తున్నారు.
గతంలో గుంటూరులోని ఓ లాడ్జిలో బాలినేని అనుచరులు ఆయనపై దాడి చేశారు. అప్పటి నుంచి భూకబ్జాలు, ఇతర విషయాలపై సుబ్బారావు గుప్తంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల మహిళా వసతి గృహంపై బాలినేని అనుచరుడు సుభాని ముఠా దాడి చేసింది. ఈ విషయంలో బాలినేని తీరును నిరసిస్తూ సుబ్బారావుగుప్తా పరుష పదజాలంతో మాట్లాడారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.