రామ్‌గోపాల్‌వర్మ హీరోయిన్ల విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లను పరిచయం చేసిన ఆర్జీవీ కొత్త అందాలను అన్వేషిస్తుంటాడు. ఆమధ్య సోషల్ మీడియాలో శ్రీలక్ష్మీ సతీష్ అనే ఓ భామ వీడియో చూసి ఆమె గురించి ఆరా తీసి మొత్తానికి ఆమెను కాంటాక్ట్ చేశాడు. తన నెక్స్ట్ సినిమాలో ఆమెను హీరోయిన్గా బుక్ చేసేశాడు. అంతేకాదు, ఆమె పేరును ఆరాధ్యదేవిగా మార్చేశాడు. ఆ సినిమా పేరు ‘శారీ’. అంతకుముందు అంతంత మాత్రంగా ఉన్న ఆమె ఫాలోవర్స్’ వర్మ ట్వీట్ తర్వాత లక్షల్లోకి చేరారు.
ఈ ‘శారీ’ హీరోయిన్ ఆరాధ్యదేవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాలోవర్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఆమె వారితో చాట్ చేస్తూ ఉంటుంది. తన ఫాలోవర్స్ అందరూ తన అందాల గురించి అడుగుతుంటారని, తన అందాలను అప్రిషియేట్ చేస్తుంటారని చెబుతుంది. ఎక్కువగా ఆమె కళ్లు, నడుము, వయసు, షేపులు, ఆ ఒంపుసొంపుల గురించే కామెంట్ చేస్తుంటారట. తనకు ఆ ఒంపుసొపులు ఎలా వచ్చాయనే ప్రశ్నలే ఆమెకు ఎక్కువగా ఎదురవుతున్నాయని చెబుతోంది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపికగా జవాబులిస్తూ.. తన వయసు 22 అనీ, హైట్ 5 అడుగుల 8 అని చెప్పింది. అయితే మీరు పొగుడుతున్న ఈ అందాలు అంత ఈజీగా నాకు రాలేదని, వాటి కోసం ఎన్నో త్యాగాలు చేశానని, మరెంతో వర్కవుట్’ చేశానని చెబుతూ.. వాటి వెనుక ఎంతో కష్టం ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న ఆరాధ్య.. వర్మ ‘శారీ’ షూటింగ్‌తో ప్రస్తుతం ఉంది. ఆమధ్య కూర్గ్‌లోని ఓ జలపాతం దగ్గర ఆరాధ్య అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఓ పాటను కూడా చిత్రీకరించారు.