ముద్ర.వనపర్తి:- గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీలో, మండల కేంద్ర జిల్లా, ప్రతి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణాల నిర్మాణం అసమగ్రంగా గ్రామాలకు దూరంగా క్రీడలకు అనువుగాని చోట ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు వినియోగించుకునే పరిస్థితి లేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మండల అభివృద్ధి అధికారులు , మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ నిధులతో చిత్తశుద్ధి కోరవడి , నామమాత్రంగా, ఏర్పాటు చేయడంతో అటు యువకులకు క్రీడాకారులకు నిరుపయోగంగా, నిరుపయోగంగా ఉన్నారు.
క్రీడా ప్రాంగణంలో ఒక బోర్డు, ఒక గ్రామంలో ఒక హారిజంటల్ బారు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.ఏ చూసిన, మండల కేంద్రాలలో చూసిన, జిల్లా కేంద్రాలలో చూసిన క్రీడా ప్రాంగణాలను ఎక్కడా అందుబాటులో దాఖలాలు లేవు.ఇప్పటికైనా మండల అభివృద్ధి అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధిపరిచి క్రీడలకు ఉపయోగపడేలా అధికారులు, ప్రతిభగల క్రీడాకారులు ఉన్నత స్థానాలకు అధిరోహించారు. అనడంలో ఎలాంటి సందేహాo లేదు.