ప్రస్తుతం కర్ణాటకను మాత్రమే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న విషయం రేవ్ పార్టీ. బెంగళూరు పోలీసులు తాజాగా నటి హేమకు రేవ్ పార్టీకి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. సోమవారం(మే 27)న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. హేమ మాత్రం తాను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ వీడియోలు కూడా విడుదల చేస్తోంది. ఇలాంటి తరుణంలో నటి హేమకు మా అధ్యక్షుడు మంచు విష్ణు తన మద్దతును తెలియజేశారు. తాను ఇంకా దోషిగా తేలలేదని.. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఆమెను బంగపరిచే విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ సూచించారు.
రేవ్ పార్టీ కేసులో మొదటి నుంచి నటి హేమ పేరు వినిపిస్తూనే ఉంది. ఆమె మొదటి నుంచి తనకు ఆ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ ఖండిస్తూనే ఉంది. అతను ఏ రేవ్ పార్టీలకు వెళ్లలేదంటూ వీడియోలు కూడా విడుదల చేస్తున్నాయి. మొదట తాను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత బిర్యానీ వస్తూ ఒక వీడియో పెట్టింది. ఇలా తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను హేమ ఖండిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు హేమకు నోటీసులు జారీ చేశారు. మే 27, సోమవారం విచారణకు హాజరు కావాలంటూ కోరారు. నోటీసులు వచ్చిన తర్వాత హేమ మీద విమర్శలు ఎక్కువయ్యాయి. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు.. హేమకు మద్దతుగా నిలిచాడు.
మంచు విష్ణు చేసిన పోస్ట్ లో ఏం చెప్పాడంటే.. “ఇటీవల వెలుగు చూసిన రైల్వే పార్టీకి సంబంధించి పలువురు వ్యక్తులు, మీడియా సంస్థలు ఎలాంటి ఆధారాలు లేకుండా నటి హేమ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అప్పుడే ఒక వార్తకు వచ్చేసి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండని నేను నిర్ణయాన్ని కోరుకుంటున్నాను. దోషిగా తేలే వరకు నటి హేమ నిర్దోషే. ఒక ఫొటో ఆధారంగా పుకార్లను ప్రాచరం చేసే ముందు.. ఆమె ఒక భార్య, ఒక తల్లి అని మర్చిపోవద్దు. ఎలాంటి ఇల్లీగల్ చర్యలను అయినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఖండిస్తుంది. నటి హేమను దోషిగా చూపిస్తూ పోలీసులు ఏదైనా ఆధారాలను చూపిస్తే.. మా అసోసియేషన్ తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది. అప్పటి వరకు ఇలాంటి ప్రచారాలు చేయకండి” అంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
నటి హేమకు నోటీసులు, రావడం ఆమె కచ్చితంగా రేవ్ పార్టీలో పాల్గొంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ.. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంచు విష్ణు ఆమెకు మద్దతు తెలిపారు. హీరోగా, మా అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన ఈ విజ్ఞప్తితో నటి హేమకు సంబంధించిన ప్రచారాలు, వార్తలకు తగ్గ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె నిజంగానే రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తేలితే మా అధ్యక్షుడిగా తాను చర్యలు తీసుకుంటాను అనే విషయాన్ని కూడా మంచు విష్ణు స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ రైల్వేకు సంబంధించి బెంగళూరు పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే పాజిటివ్ వచ్చింది అనుకున్న అనుమానితులు అందరికీ నోటీసులు పంపారు. ఈ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచి చూడాలి. నటి హేమకు మంచు విష్ణు మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి, కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు.
నిర్ధారణలకు దూకడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. శ్రీమతి హేమ నిర్దోషిగా భావించడానికి అర్హులు…
— విష్ణు మంచు (@iVishnuManchu) మే 25, 2024