టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘శ్రుతి హాసన్’.. గత కొంతకాలంగా ఈ అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో తరుచుగా శ్రుతి హాసన్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అందుకు కారణం.. శ్రుతి హాసన్ కు శాంతన్ కు హజరికాతో బ్రేకప్. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ బ్రేకప్ రూమర్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక తన తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజరికాతో విడిపోయినట్లు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి బ్రేకప్ రూమర్స్ పై అటు శ్రుతి హాసన్ కానీ, శాంతన్ హజరికా కానీ ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా మొదటిసారి శ్రుతి తమ బ్రేకప్‌పై స్పందించి క్లారిటీ ఇచ్చింది ఆ వివరాల్లోకి వెళ్తే..
గత కొన్ని రోజులుగా శ్రుతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజరికాతో విడిపోయినట్లు నెత్తింట వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరు ఒకరినొకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అలాగే కొన్ని రోజులుగా సినిమా ఈవెంట్స్, పార్టీలకు శ్రుతి ఒంటరిగా హాజరు కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటి వరకు తమ బ్రేకప్ విషయంలో వస్తున్న రూమర్స్ పై ఇద్దరిలో ఎవరు స్పందించలేదు. ఇక గతంలో తమ లవ్, బ్రేకప్ గురించి మాట్లాడేందుకు శంతను నిరాకరించాడు. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రుతి హాసన్. మొదటిసారి బ్రేకప్ గురించి రియాక్ట్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ కోరికనే తాజాగా ఇన్ స్టాలో లైవ్ లో పాల్గొన్న శ్రుతి హాసన్ తన ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. కాగా, అందులో ఓ నెటిజన్ సింగిల్ లేదా కమిటెడ్ ఆ అంటూ ప్రశ్నించారు. అందుకు శ్రుతి రియాక్ట్ అవుతూ.. ‘ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వడం నాకు సంతోషంగా అనిపించలేదు. కానీ, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఇక మింగిల్ అయ్యేందుకు ఇష్టపడతాను. అలాగే పని చేస్తూ నా జీవితాన్ని ఆనందిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ శంతనుతో శ్రుతి హాసన్ విడిపోయింది అనే విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చిందంటున్నారు. అయితే ఏది ఏమైనా శ్రుతి సినీ కెరీర్‌ను సరిగ్గా ఫ్లాన్ చేసుకొని దూసుకుపోతుంది కానీ, వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సరిగ్గా ఫలాన్ చేసుకోలేదంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి, శృతి హాసన్ తన భాయ్ ఫ్రెండ్ శాంతనుతో బ్రేకప్‌పై క్లారిటీ ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.