సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం అని అందరికి తెలుసు. కానీ, ఇక్కడ ఎవరీ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ ఊహించలేము. ఎందుకంటే.. ఇక్కడ ఎటువంటి సినీ బ్యాక్ డ్రాప్ లేని వారు కూడా నేడు మెగాస్టార్, సూపర్ స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. సిల్వర్ స్క్రీన్ పై ఉన్న సెలబ్రిటీస్ లో చాలా వరకు అందరూ చిన్న స్థాయి నుంచి కెరీర్ మొదలుకొని నేడు స్టార్స్ గా వెలుగు చూస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటి,నటులు కాకముందు తమకు నచ్చిన వృత్తిలో కొనసాగారు.. ఆ తర్వాత వెండితెరపై అడుగులు వేసిన వారు ఉన్నారు. అయితే వీరిలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ కిడ్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా. అవును పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఒకప్పుడు రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసింది. కానీ, ఇప్పుడు ఈమె ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఈమె ఒక స్టార్ సెలబ్రిటీ కిడ్ కూడా కావటం గమన్హారం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. అంతేకాకుండా.. ఈమె స్టార్ నటుడు, నిర్మాత కుమార్తే కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ ‘సోనమ్ కపూర్’. ఈమె ప్రముఖ నటుడు నిర్మాత ‘అనిల్ కపూర్’ కుమార్తే అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోనమ్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. అంతేకాకుండా.. ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే సోనమ్ వెండితెరకు పరిచయం కాకముందు.. రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పని చేసిందంట. కాగా, సింగపూర్‌లోని చదువుకునే రోజుల్లో సోనమ్ తన సొంత కాళ్లపై నిలబడాలని, కుటుంబంపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో.. అక్కడ ఓ చైనీస్ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పని చేసిందట. ఇక అప్పుడు సోనమ్ వయసు 15 కావడం విశేషం. అలా అక్కడ నుంచి వచ్చేసిన సోనమ్ ఆ తర్వాత.. సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ అంటేనే.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘సావరియా’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. సోనమ్ యాక్టింగ్, పర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
దీంతో సోనమ్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో.. సోనమ్ 2018లో తన బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక ఆనంద్ కూడా వ్యాపారవేత్త అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి వీరిద్దరికి ఓ మగ బాబు ఉన్నాడు. ఇదిలా ఉంటే.. సోనమ్ హీరోయిన్ కాకముందు వెయిట్రెస్ గా పని చేసిందనే వార్తలో ఎంతవరకు నిజం ఉందో కానీ, ప్రస్తుతానికి ఈ వార్త పలు మీడియా కథనాలలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్న నెటిజన్స్ సెలబ్రిటీ కిడ్ అయిన సోనమ్ కు వెయిట్రెస్ గా పని చేస్తే ఏమిటంటూ షాక్ అవుతున్నారు. మరి కొందరు చేసి తన సొంత కాళ్లపై నిలబడాలనే వ్యక్తిత్వంతో పని చేసిందని అందులో తప్పేముందని ప్రశంసిస్తున్నారు. మరి, ఏది ఏమైనా సోనమ్ కపూర్ హీరోయిన్ కాకముందు రెస్టారెంట్ లో వెయిట్రెస్ గా పనిచేసిందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.