సినిమా తారలందరికీ అభిమానులు ఉంటారు. ఇక స్టార్ హోదాలో ఉన్నవారికైతే చెప్పక్కర్లేదు. వారికి మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఒకప్పుడు అలాంటి ఫాలోయింగ్ తెచ్చుకోవాలంటే ఎన్నో సినిమాలు చేసేవారు. వారి అభిమానాన్ని పొందేందుకు ఎంతో కృషి చేయాలి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక్కసారిగా తారాథంలో దూసుకెళ్ళడానికి కేవలం ఒక్క సినిమా చాలు. ఇది ఈమధ్యకాలంలో చాలామంది హీరోలు, హీరోయిన్ల విషయంలో ప్రూవ్ అయింది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కనిపించే ఆ ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేస్తుంది. అలా ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను పొందిన హీరోయిన్ మమిత బైజు. ‘ప్రేమలు’ చిత్రంతో హీరోయిన్గా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
‘ప్రేమలు’ చిత్రం మలయాళంలో రూపొందించిన సినిమా. అక్కడ సూపర్ డూపర్ తమిళహిట్ అయిన ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు. రెండు భాషల్లోనూ ఘనవిజయం. ముఖ్యంగా తమిళనాడులో ఆమెకు వీరాభిమానులు పెరిగిపోయారు. మలయాళంలో కొన్ని సంవత్సరాలుగా సినిమాలు చేసిన ‘ప్రేమలు’ మాత్రమే ఆమెను స్టార్ హీరోయిన్గా చేసింది. సాధారణంగా హీరోయిన్లు పబ్లిక్‌లోకి వస్తే ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అందరికీ ఇబ్బందులు. వారు బాడీ గార్డ్స్ లేకుండా బయటికి అడుగుపెట్టే అవకాశం లేదు. అయినా వారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి అనుభవమే ఇటీవల మమిత బైజుకి ఎదురైంది.
కొన్ని ఫంక్షన్స్‌కి, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌కి హీరోయిన్లను గెస్టులుగా ఆయా షాపుల యాజమాన్యం ఆహ్వానిస్తారు. ఇటీవల చెన్నయ్‌లోని వి.ఆర్.మాల్లో ఓ గోల్డ్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మమిత హాజరయ్యారు. ఆమె రాక గురించి ముందే తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ బ్యూటీని దగ్గరగా చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు సిద్ధమయ్యారు. ఆమె రాగానే ఒక్కసారిగా అక్కడ కలకలం మొదలైంది. ఆమెను చూసేందుకు జనం ఎగ ప్రదర్శించారు. సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆమె దగ్గరకు వెళ్ళేందుకు ట్రై చేశారు. పరిస్థితిని గమనించిన మమిత సన్నిహితులు, బాడీ గార్డులు ఒక వలయంలా ఏర్పడి ఆమెను సురక్షితంగా మాల్‌లోకి తీసుకెళ్లారు. ప్రారంభోత్సవం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారడంతో ఆమెను మరింత జాగ్రత్తగా బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మమిత భయం భయంగా బయటికి రావడం, తనకు ఏం జరుగుతుందోననే ఆందోళన ఆమెలో కనిపించింది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా క్షేమంగా ఆమెను అక్కడి నుంచి పంపించి ఊపిరి పీల్చుకున్నారు గోల్డ్ షాప్ అధినేతలు.