ఒకప్పుడు నిబ్బా.. నిబ్బా ప్రేమ కథల్ని బాగా ఆదరించారు సినీ ప్రేక్షకులు. స్కూల్ అండ్ ఇంటర్, డిగ్రీలో అప్పుడే అడుగుపెట్టిన స్టూడెంట్స్ ప్రేమలో పడే కథలతో లవ్ స్టోరీస్ సినిమాలు తెరకెక్కించేవి. టీనేజ్ అమ్మాయి, అమ్మాయి ప్రేమలో పడి.. తమ లవ్ సక్సెస్ అయ్యేందుకు తల్లిదండ్రులతో పోరాడుతున్నారు. కాదంటే ఇంట్లో వెళ్లిపోవడం.. చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం, రౌడీలతో ఛేజింగ్.. అబ్బో ఎన్నో మలుపులు ఉంటాయి. చిత్రం, నువ్వు నేను, జయం, గంగోత్రి, జూనియర్స్, నోట్ బుక్, ప్రేమిస్తే.. ఇటీవల బేబి మూవీ వరకు ఇలాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ఆకట్టుకున్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి 10వ తరగతి.
ఇప్పటి తరానికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ.. 2006లో మంచి హిట్ అందుకుంది ఈ మూవీ. ఇందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో భరత్ హీరో. ప్రేమిస్తే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించిన శరణ్య నాగ్ ఇందులో మెయిన్ హీరోయిన్. అలాగే ఇప్పుడు ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ హీరోయిన్.. సునైనా సెకండ్ లీడ్ చేయడం. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించడం విశేషం. ఈ 10వ క్లాస్ మూవీ అప్పట్లో సినీ ప్రియులను అలరించింది. ప్రేమిస్తే సంధ్య ఫ్రెండ్ పాత్రలో మెరిసిన శరణ్య ఇప్పుడెలా ఉందో తెలుసా..? చాలా ఛేంజ్ అయ్యింది. తమిళ పొన్ను అయిన ఈ బ్యూటీ.. చైల్డ్ ఆర్టిస్టు నుండి సినిమాలు చేస్తూ.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది.
తమిళనాడులో పుట్టి పెరిగిన శరణ్య.. చైల్డ్ ఆర్టిస్టుగా రెండు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బైలింగ్వల్ మూవీ నీ మనసు నాకు తెలుసు చిత్రంలో కాలేజీ స్టూడెంట్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ప్రేమిస్తే ఆమెకు ఛాన్స్ వచ్చింది. అందులో ఫ్రెండ్ ప్రేమకు సాయం చేస్తుంది. ఆ తర్వాత ఆమెకు 10వ తరగతి సినిమాలో మెయిన్ హీరోయిన్ ఆఫర్ వచ్చింది. అటు వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వచ్చింది. ప్రేమ ఒక మైకం, దూసుకెళ్త వంటి చిత్రాలలో కూడా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఓ సంస్థను స్థాపించినట్లుగా. పుష్కర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ హబ్ పేరుతో వ్యాపార సమాచారం. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటే శరణ్య.. ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయింది. అయినా.. తన కట్టుబొట్టుతో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఎటువంటి సినిమాలు చేయడం లేదని.