ముద్రణ, తెలంగాణ బ్యూరో: ఈనాడు గ్రూప్ మీడియా సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రామోజీరావును 5న హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో గత రాత్రి ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని రామోజీ ఫిలిం సిటీలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు ప్రగాఢ సంతాపం చేస్తున్నారు.
మీడియా నూతన ఒరవడులు సృష్టించిన రామోజీరావు మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ స్టేట్ రంగంలో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (తీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.