ముద్ర,తెలంగాణ:- ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఈ సందర్భంగా రామోజీరావు మృతి పట్ల సంతాప సూచికగా రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్