నేటి సమాజంలో ఈజీ మనిషికి అలవాటుపడి.. దొంగతనాలకు ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే వారిని కూడా వదలడం లేదు నిందితులు. ఆడవారి మెడలో బంగారు గొలుసు కనిపిస్తే చాలు.. నెమ్మదిగా వచ్చి లాక్కెళ్లిపోతున్నారు. ఇక ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. వెంటనే రంగంలోకి దిగుతున్నారు నేరగాళ్లు. తాళాలు పగలకొట్టి మరీ దోపిడీ చేస్తున్నారు. ఇక గత కొంత కాలంగా సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. వారి ఇండల్లో అయితే భారీ ఎత్తున సొత్తు లభిస్తుంది అనే ఉద్దేశంతో వారి నివాసాలను టార్గెట్ చేస్తున్నారు. ఈ తాజాగా మరో నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆ వివరాలూల..
ప్రముఖ నటి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రామాలు ఆభరణాలతో పాటు డబ్బులు కూడా దోచుకెళ్లారు నేరగాళ్లు. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి ఎవరంటే.. మరాఠీ యాక్ట్రెస్ శ్వేత షిండే. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలు చేస్తూ చాలా ఉంది. ఇంకా నిర్మాతగా మారి సీరియల్స్ కూడా నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ నటి, తన తల్లితో కలిసి మహారాష్ట్రలోని సతారాలో నివాసముంటోంది. అయితే జూన్ 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో నటి నివాసంలో దొంగలు పడ్డారు. 110 గ్రామాలు ఆభరణాలతో పాటు డబ్బు కూడా దొంగతనం జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో శ్వేత షూటింగ్ కోసం ముంబై వెళ్లినట్లు సమాచారం.
ముంబై నుంచి తిరిగి వచ్చిన శ్వేతకు తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయం అర్థం అయ్యింది. దాంతో ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్వేత షిండే. తన ఇంట్లో పది తులాల బంగారంతో పాటు భారీ మొత్తంలో నగదు దొంగతనానికి గురైంది. అయితే పోయిన డబ్బులు మొత్తం ఎంతనేది క్లారిటీ లేదు. ప్రముఖ నటి ఇంట్లోనే దొంగలు పడటం అనేది స్థానికంగా సంచలనంగా మారింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న.. నిందితులను గాలించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఇక నటి శ్వేత వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో సందీప్ భన్సాలీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ కూతురు కూడా ఉంది. 2016లో నిర్మాతగా మారి అప్పటినుంచి యాక్టింగ్ కాస్త పక్కనబెట్టి పలు సీరియల్స్, సినిమాలు తీస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో చోరీ జరగడంతో ఈమె వార్తల్లో నిలిచింది.