తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ‘చత్రపతి’ మూవీ నుంచి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, బాహుబలి 2 తో ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తూ తన సత్తా చాటుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా నటించే ప్రతి సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఇటీవల సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. త్వరలో ‘కల్కీ 2898AD’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ల బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. వివరాల్లోకి వెళితే..
ప్రభాస్ కి గొప్ప శుభవార్త.. ఒకేసారి ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నారు ‘కల్కీ 2898AD’టీమ్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కీ 2898AD’ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుతూ వస్తున్న ఈ మూవీ కలెక్షన్లు కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం ఇండియాస్ ఫ్యూచరిస్టిక్ట్ కాన్సెప్ట్ తో కల్కీ 2898 AD తెరకెక్కుతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, గ్లింబ్స్, టీజర్ చూస్తుంటే నాగ్ అశ్విన్ టేకింగ్.. కంటెంట్ ప్రజెంటేషన్ అద్భుతంగా కనిపిస్తుంది.. అందుకే ఈ మూవీ థియేటర్లకు వస్తుందా అన్న క్యూరియాసిటీతో పబ్లిక్‌గా చూస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ జూన్ 10న విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దర్శకులు నాగ్ అశ్విన్ ‘కల్కీ 2898AD’ మూవీ ప్రమోషన్లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 10న ట్రైలర్ తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ వినూత్నంగా ప్లాన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 9న ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది.. అందుకే మరో రోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అమరావతిలో జూన్ 22, 23 ఏదో ఒక తేదీ అక్కడ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు లోనే కాదు.. పాన్ ఇండియా మూవీ కనుక ముంబైలోనూ ఓ ఈవెంట్ చేయాలనే ఆలోచనలో కనిపిస్తుంది. జూన్ 27 నాటికి ఏపీలో రాజకీయ వాతావరణం వచ్చే అవకాశం ఉందని ధియేటర్లకు అభిమానులు వస్తారని ఆశిస్తున్నారు మూవీ మేకర్స్. కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ అనౌన్స మెంట్ రాలేదు.