మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(విజయ్ సేతుపతి) యాక్టింగ్ రేంజ్ గురించి అందరకీ తెలుసు. స్క్రీన్ మీద ఆయన పెర్ఫార్మ్ చేస్తుంటే రెండు కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తారు. ఎన్నో అధ్బుతమైన సినిమాల్లో ఎన్నో అధ్బుతమైన పాత్రలని పోషించి అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన చెప్పిన కొన్ని మాటలు టాక్ ఆఫ్ ది డే గా నిలిచాయి.
విజయ్ సేతు అప్ కమింగ్ మూవీ మహారాజా(Maharaja)తెలుగు ప్రమోషన్స్ కోసం సేతుపతి హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం జరిగింది. అందులో ఆయన వచ్చి రాణి తెలుగులో మాట్లాడుతుంటే కొంత మంది విలేకర్లు తెలుగులోనే మాట్లాడమని ఒత్తిడి చేసారు. దాంతో నాకు తెలుగు లైట్ గా ఉండే మా ఇంటి దగ్గర అవినాష్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నాడని ఆయన దగ్గర తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన చాలా మంది విజయ్ సేతుపతి తెలుగు బాష నేర్చువాలని ఎంతో పట్టుదలగా ఉన్నాడంటూ పొగడ్తల వర్షాన్ని కురిపిస్తున్నారు.
ఇక మహారాజా మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. టీజర్ రిలీజ్ తో సేతుపతి మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడనే విషయం అర్ధమవుతుంది. నీతిలాన్ స్వామి నాధన్ రచన దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా చేస్తుంది. చాలా ఏళ్ళ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తుంది. సుదాన్ సుందరం, పళని స్వామిలు ఉన్నారు.