తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు యాక్షన్ కింగ్ అర్జున్(అర్జున్)పేరుకి కన్నడ నటుడు అయినా కూడా ఎనభయ్యవ దశకం నుంచే తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. దర్శకుడిగా కూడా అవతారం ఎత్తి మంచి సినిమాలని ప్రేక్షకులకు అందించాడు. తాజాగా ఆయన కూతురు వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
అర్జున్ కి ఐశ్వర్య(ఐశ్వర్య)అంజనా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పేరు ఐశ్వర్య. ఇప్పుడు ఆమె వివాహం ప్రముఖ హీరో ఉమాపతి రామయ్య (Umapathy Ramaiah)తో జరిగింది. జూన్ 10న చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి మందిరంలో బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగింది. తమిళ సినీ రంగంలో ఫేమస్ కమెడియన్ అయినటువంటి తంబి రామయ్య కుమారుడే ఉమాపతి. జూన్ 7న హల్ది కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. పెళ్లికి ముందు రోజు సంగీత కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీల ప్యాలెస్ లో జరగనుంది.
దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన పలువురు సెలబ్రటీస్ ఆ ఫంక్షన్ కి హాజరు కానున్నారు. ఐశ్వర్య హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో చేసింది. తెలుగులో కూడా విశ్వక్ సేన్ తో అనుకున్నారు కానీ కుదరలేదు. విశాల్ హీరోగా వచ్చిన పట్టతు ఎన్నై తో తమిళ సినీ రంగ ప్రవేశం చేసింది. 2013లో ఆ మూవీ రిలీజ్ అయ్యింది.ఇక ఉమా పతి రామయ్య కూడా తమిళ సినీ రంగంలో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. అధగ పట్టతు మగజనంగాలై ,మణియార్ కుదుంబమ్, తిరుమానం తన్నే వండి లాంటి చిత్రాలు చేసాడు.