భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో నందమూరి అక్కినేని, చిరంజీవి, హిందీలో రాజ్ కపూర్ కుటుంబాలు ఎలాగో, కన్నడంలో రాజ్ కుమార్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజ్ కుమార్ తర్వాత శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ (puneeth rajkumar)లు హీరోలుగా వచ్చి తమ సత్తా చాటారు. 2021లో పునీత్ అకాల మరణం చెందడంతో ఆయన అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నడ నాట కొన్ని రోజుల పాటు ఆయన అభిమానులు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోలేదు. దీన్ని బట్టి ఆ కుటుంబాన్ని ఎంతగా అభిమానిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన ఆ కుటుంబానికి మాయని మచ్చని తెచ్చిపెట్టింది.
రాఘవేంద్ర రాజ్ కుమార్ కొడుకు పేరు యువ రాజ్ కుమార్.(yuva rajkumar)యువ (yuva)సినిమా ద్వారా కన్నడ చిత్ర సీమకి పరిచయమయ్యాడు. మొన్న మార్చిలోనే రిలీజ్ అయ్యింది. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు కూడా వచ్చింది.ఇప్పుడు తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ సందర్భంలో యువ తరుపు లాయర్ చెప్పిన విషయం సౌత్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది. శ్రీదేవి కి రాధయ్య అనే వ్యక్తితో అనైతిక సంబంధం ఉంది. యువ తో పెళ్లి జరగక ముందునుంచే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది.పెళ్లి అయ్యాక కూడా కంటిన్యూ చేసింది. ఐఏఎస్ చెయ్యాలనుకున్న శ్రీదేవి కోచింగ్ కి వెళ్తున్నట్టు నటించి రాధయ్య దగ్గరకి వీల్లేదని కోర్టులో విన్నవించాడు కాకపోతే ఆ ఆరోపణలన్నిటిని శ్రీదేవి తరుపు లాయర్ ఖండించాడు. విడాకులు అనేది కేవలం వైవాహిక జీవిత సమస్య అని వాదించాడు. కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.
శ్రీదేవి మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. యువ ని మానసికంగా వేధించేదని కూడా అంటున్నారు.ఇక శ్రీదేవికి రాధయ్యకి ఐఏఎస్ కోచింగ్ దగ్గర పరిచయమని తెలుస్తుంది. 2019 లో యువ శ్రీదేవి ల వివాహం జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన ఎంతో మంది అతిరథ మహారధులు ఆ వివాహానికి ప్రముఖులు. మన తెలుగు నాట నుంచి చిరంజీవి హాజరయ్యాడు.