- తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతి మోడీకి పడుతుంది
- తెలంగాణ గడ్డమీదకి వచ్చి బెదిరిస్తే రజాకర్ల గతి బీజేపీకి పడుతుంది
- రిజర్వేషన్లు రద్దు చేసి ఇచ్చిన తెలంగాణను అవమానపరచడమే కాంగ్రెస్ ముక్తు బారతా ?
- కోరుట్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రిజర్వేషన్లు ఇవ్వమన్నందుకు నాపై కేసు పెడతారా మోదిగారు.. కేసులకు నేను భయపడతానా… తెలంగాణ పౌరుషం గుజరాత్ ఆధిపత్యానికి పోటీ ఇది ఇక్కడ భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఖబర్దార్ ప్రధానమంత్రి అని సియం రేవంత్ రెడ్డి మోదిని హెచ్చరిచారు. కోరుట్ల జనజాతర సభలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి పాల్గొన్న సియం రేవంత్ రెడ్డి మేడే సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడతూ కార్మికులందరూ కలిసి సకల జనుల సమ్మె చేపడితే.. కార్మికుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మేడే సందర్భంగా కార్మికులకు సియం శుభాకాంక్షలు తెలిపారు. మోడీ తెలంగాణ పర్యటనఫై సియం సూచనూ ఇది నా ఊరు నా ప్రాంతం నా ఊరికి వచ్చి నన్నే భయ పెడతావా.. ఆధిపత్యం చేయాలనుకుంటే ప్రధానికి నిజాములకు పట్టిన గతి పడుతుంది.
ఈ ఎన్నికలు ఆశమాసి ఎన్నికలు కాదు.. 17 సార్లు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్న 18వ పార్లమెంట్ ఎన్నికలు గతంలో కంటే… ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. బిజెపి 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి కంపెనీలు..అధాని.. అంబానీలకు దేశాన్ని అమ్మాలని కుట్ర జరగాలని అన్నారు. రాజ్యాంగం పై దాడి జరుగుతుంది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలి.. ఇది మన సమాజానికి పెను ప్రమాదమని హెచ్చరిక.
70 సంవత్సరాలు వచ్చిన దళిత, గిరిజనులకు రావలసిన అవకాశాలు ఇంకా రాలేదని కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతో సామాజిక న్యాయం రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చాక బీసీ జనాభా లెక్కలు చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే పదేళ్లు దళితులను, బీసీలను పీడించి వందేళ్ళ విధ్వంసాన్ని సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని పక్కనపెట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని అన్నారు. బలహీన వర్గాలను లెక్కించాలని క్యాబినెట్లో, శాసన సభలో తీర్మానం చేసి నిధులు కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి వారి అభ్యున్నతికి కృషి చేయాలనీ నిధులు కేటాయిస్తే పెద్ద కుట్ర జరుగుతుందని అన్నారు.
బిజేపీ 2/3 మెజార్టీ లభిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, అందుకే 400 సీట్లు గెలిచి రిజర్వేషన్ రద్దు చేస్తారని అన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీలపై జాగృతి చేస్తున్నాడని ఢిల్లీలో అమిత్ షా నాపై కేసు పెట్టారని అన్నారు. పదేళ్లు చేసిన పని ఇప్పుడు లక్షల మోడీ కెసిఆర్ చేస్తున్నాడని, ఢిల్లీలో పోలీసులు ఈడీ, సిబిఐ, ఇన్‌కంటాక్స్ ఉండవచ్చు… నా దగ్గర 50 మంది తెలంగాణ యువకులు ఉన్నారు.. మా వాళ్ల దెబ్బకు చంద్రశేఖర్‌రావు బోర్లబొక్కల పడ్డాడు… మీరు కూడా పడుతారని మోడీని హెచ్చరించారు. తెలంగాణకు వచ్చిన నరేంద్ర మోడీ ప్రధానిగా కాకుండా గుజరాత్ వాడిగా వచ్చి దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడని.. బాండు ఇచ్చిన అరవిందానికి పసుపు బోర్డు ఇవ్వలేదు.. చెరుకు కర్మాగారం గురించి చెప్పారు.
మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడం, ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కాంగ్రెస్ ముక్తు భారత అని సింయం ప్రశ్నించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ అబధం చెబుతున్నారని, మోడీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని, రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేసిందని, ధీనిఫై 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చారని, అన్ని వివరాలను ఆధారాలతో సహా బయట పెడతానని అన్నారు. పదేళ్లలో తెలంగాణకు మోడీ గాడిద గుడ్డు ఇచ్చిండని ఎద్దేవా చేశారు. 43 ఏళ్ల ప్రజా జీవన్ రెడ్డి వల్ల పదవులకు వనే వచ్చింది… ఏనాడు కూడా అవినీతికి అవకాశం కల్పించేందుకు పదవులను వినియోగించుకోలేదు. రిజర్వేషన్లు ఉండాలంటే జీవన్ రెడ్డి గెలవాలన్నారు.
నిజామాబాదు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం… జగిత్యాల రాజకీయ సేవ చేయడం నా బాధ్యత అని నిజామబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి అన్నారు. కోరుట్లలో జరిగిన జన జాతర సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపిగా అరవింద్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి రైతాంగాన్ని అష్ట కష్టాలపాలు చేశాడని అన్నారు. తాను తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాలలో ఏర్పాటు చేశానని .. అందరూ అరవింద్ లాగా ఉంటారనుకోవద్ధని వాళ్లు కూడా నాలా ఉంటారని అన్నారు. జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చానని వైయస్సార్ హయాంలో పులివెందులకు దీటుగా జగిత్యాల అభివృద్ధి చేశానని ..పులివెందులలో లేని కళాశాలలు జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఘనత జీవన్ రెడ్డి అని పేర్కొన్నారు. జగిత్యాలలో మామిడి పరిశోధనా కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్, హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేసింది, … అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కల్పించాలని సియం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అది శ్రీనివాస్ , కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్శింగరావు నిర్వహించారు.