- ధర్మపురి మండలం నేరాలలో అత్యధికంగా 46.7 ఉష్ణోగ్రత నమోదు
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వాతావరణ శాఖ అధికారులు జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని ముందుగానే రెడ్ అలర్ట్ ప్రకటించింది. జగిత్యాల జిల్లాలో మధ్యాహ్నం ఎండలు మండిపోయాయి… ఎండల దాటికి ప్రజల ఇళ్లకే పరిమితమై రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10 గంటల నుండి భానుడి భాగ, భగలు ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు మండలం ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో అత్యధికంగా 46.7 డిగ్రీలు, భూదేశ్ పల్లిలో 46.1 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం గోధుర్ గ్రామాల్లో 46.3 డిగ్రీల అత్యధిక డిగ్రీలు నమోదు అయ్యాయి. జగిత్యాలలో అత్యల్పంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
పగటిపూట ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు.ఇప్పటికే వడ దెబ్బ కారణంగా వెల్గటూర్ ఎంఈఓ భూమయ్య మృతి చెందారు. ప్రస్తుతం మండుతున్న ఎండల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప రా లేకపోతే వచ్చినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని గొడుగులు ,తలపాగా చుట్టుకుని రావాలని, పిల్లలు కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. ఎండ రాకముందు ఉదయం, సాయంత్రం వేళలోనే పనుల నిమిత్తం వెళ్లాలని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.