ముద్ర,హైదరాబాద్:- ఇవాళ ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనఖీలు నిర్వర్తించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడింది. సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి లభ్యమైంది.సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తుండగా పట్టుకుని ఆర్జీఐ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. అనంతరం పట్టుబడిన బంగారాన్ని, వెండి ని ఎఫ్‌ఎస్‌టీ టీంకు అప్పగించారు. ఈ కేసు విచారణలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఉన్నారు.