ముద్ర. వనపర్తి:- నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలని కోరుతూ వనపర్తి జిల్లా మెంటేపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లా చిన్నారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, అదే విధంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలలో డా. మల్లు రవి ని అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని ప్రజలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో 5 ఇప్పటికే అమలు చేస్తున్నామని,ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పథకాలు అమలు చేస్తున్నాం సమస్యలను చిన్నారెడ్డి దృష్టికి తెచ్చారు. ఎన్నికల అనంతరం గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ ఐపిసి కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి మండల అధ్యక్షులు వెంకట నారాయణ, జిల్లా, మండల, గ్రామ ముఖ్య నాయకులు ఉన్నారు.