ముద్ర,తెలంగాణ:- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తలకొండపల్లి మండలం వెల్జార్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తుండగా.. శివారులో ఎమ్మెల్యే కారు ఓ బైకు ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో నరేశ్ (25) అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరశురామ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతులను వెంకటపుర్కు చెందిన వారిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి కారు ధ్వంసమైంది. ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు చికిత్స కోసం ఆయనను హాస్పటల్ కు తరలించారు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..