- భార్య, భర్తను ఆసుపత్రికి తరలింపు మృతి
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం ప్రియదర్శిని నగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి (57), పుష్పలత దంపతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తను ఆసుపత్రికి తరలించారు. కృష్ణమూర్తి దంపతులు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు స్థానిక బంగల్ పేట్ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటుగా వెళుతున్నవారు వీరిని రక్షించే యత్నం చేశారు. ఐతే వీరిని బయటకు తీసే లోపునే భార్య పుష్పలత మృతి చెందింది. ప్రాణాలతో ఉన్న కృష్ణమూర్తి ని ఆసుపత్రికి చికిత్స.