ముద్ర,సెంట్రల్ డెస్క్:- దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ భారీగా మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 21 ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టాలు ఏమైనా జరిగిన విషయంపై ఎలాంటి సమాచారం లేదు. సంఘటనాస్థలికి పోలీసులు, అధికారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితులను చూస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.