ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో మంగళవారం సాయంత్రం (మే 14) బెంగాల్ టైగర్ (తెల్ల పులి) కనిపించింది.9 ఏళ్ల వయస్సు ఉన్న అభిమన్యు అనే పేరు గల ఈ పెద్ద పులి గతకొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతోంది. 2015 జనవరి 2న జన్మించిన అభిమన్యు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో చివరికి ప్రాణాలు వదిలింది.
బెంగాల్ టైగర్‌ను రక్షించేందుకు మెరుగైన చికిత్సలు అందించడానికి ఎలాంటి ఫలితం లభించలేదని జూపార్క్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి నెహ్రూ జూపార్క్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.హైదరాబాద్‌లోని వీఆర్‌బీఐ, సీవీఎస్‌సీ వెటర్నరీ నిపుణుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి, పులికి అంత్యక్రియలు జరిగాయి. పులిపట్ల జూ అధికారులు, కార్మికులు మృతి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.