ముద్ర,తెలంగాణ:- చేప మందు పంపిణీకి డేట్ ఫిక్స్ అయింది. జూన్ 8న చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది.
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఈ ప్రసాదం ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తే వాళ్ల సంఖ్య వేలల్లో ఉంటుంది.