ముద్రణ ప్రతినిధి భువనగిరి : ఈ నెల 27న జరగనున్న జిల్లా వరంగల్ ఉమ్మడి ఖమ్మం నల్లగొండల పట్టబద్దుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ పట్టభద్రులను లెక్కించారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోరుతూ భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. అన్యాయాలని ఎదిరించే శక్తిగా నిర్బంధాలను ఎదుర్కొని జైలు జీవితం గడిపి పాలకులు ఎంతటి వారైనా వారి అన్యాయాలపై పోరాడే దమ్మున్న వ్యక్తి చింతపండు మల్లన్న అని ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామ బిడ్డ అయిన తీన్మార్ మల్లన్న భువనగిరిలో చదువుకున్నందున తీన్మార్ మల్లన్న భువనగిరిలో అధిక సంఖ్యలో చదువుకున్నందున తీన్మార్ మల్లన్న మనందరి కుటుంబసభ్యుడిగా భావించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంర్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సై అధ్యక్షులు దర్గాయి హరిప్రసాద్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు కాల్య నాగరాజు, పట్టణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు డాకూరి ప్రకాశ్, సోమ రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజు, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాల్వేరు ఉపేందర్ ,తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్, నాయకులు నాకోటి రాము, కూర శివ ఉన్నారు.