ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో ఐకెపి సెంటర్‌లో సకాలంలో ప్రభుత్వ వడ్ల కొనుగోలును పూర్తి చేసిన సందర్భంగా సెంటర్ నిర్వాహకులు, హమాలిలను విప్ , ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడతూ సమిష్టిగా కృషి చేసి ధాన్యం కొనుగోలు పూర్తి చేయడం అభినందనీయమన్నారు. అందరు ఇలానే కష్టపడితే రైతుల ఇబ్బందులు తొలగిపోతున్నాయని అంటున్నారు. ఈ కార్యక్రమంలో, ఐకేపీ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు.