కోరుట్ల, ముద్ర: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావు పేట వద్ద వేకువ జామున జాతీయ రహాదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టానికుల అందించిన సమాచారం ప్రకారం మెట్‌పల్లి పట్టణానికి చెందిన మహాజన్ శివరామకృష్ణ హైదరాబాద్ వెల్లి తానా సొంత గ్రామమైన మెట్‌పల్లి కి తిరుగు ప్రయాణంలో తన పెద్ద కొడుకు సాయి అక్షయ్ తో కలిసి వస్తుండగా జాతియ రహదారి మెట్‌పల్లి మండలం రాజేశ్వర్ రావు పేట వద్ద ఆగి ఉన్న లారిని డీకొట్టడం తో ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సాయి అక్షయ్ అక్కడికక్కడే మృతి చెందగా శివరామకృష్ణకు తీవ్ర గాయాలపాలై రెండు కాళ్లు విరిగాయి. క్షతగాత్రుణ్ణి వెంటనే 108 లో నిజామాబాద్ ఆసుపత్రికి తల పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.