ముద్ర,తెలంగాణ:-రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో చనిపోయిన వారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు కారులో వస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తుంది.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులోని వారు మృతి చెందారు. అందులోనే ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతి చెందినవారంతా హైదరాబాద్ కు చెందిన వారని పోలీసులు గుర్తించారు.