ముద్ర.వీపనగండ్ల:- కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పెంట్లవెల్లి మండల కేంద్రం మల్లేశ్వరం దారిలో ఉన్న బ్రిడ్జి పై రైతులు ఆరబోసిన వరిధాన్యాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతుందా లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మంత్రి జూపల్లి రైతులను అడిగి తెలుసుకున్నారు.సమయంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన డబ్బులు వారికి అందజేసారు. చిన్నారులతో కలిసి సరదాగా క్రీడలు ఆడారు.నేటి యువతకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం అని,క్రీడలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసాని అందించాలని వివరించారు.