ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్ నగర శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రాచకొండ కమిషనర్ రేట్ మేరకు మేడిపల్లిలో పసిపిల్లలను అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి…ముఠా నుంచి 16 మంది పిల్లలను కాపాడారు.ఇతర రాష్ట్రాల పేదలను అపహరించి.. తెలంగాణకు పిల్లలను తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.