ముద్ర,తెలంగాణ:-ఢిల్లీ హైకోర్టులో కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. నిన్న ప్రారంభమయిన విచారణ నేడు కూడా జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.నిన్న కవిత తరుపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఈడీ, సీబీఐ తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. నేడు సీబీఐ, ఈడీ వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తానని జడ్జి స్వర్ణకాంత శర్మఇప్పటికే చెప్పారు.