ఇద్దరు మృతి… ఒకరి పరిస్థితి విషమం
హుజూర్ నగర్, ముద్రణ ప్రతినిధి: డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన బుధవారం గోపాలపురం గ్రామంలో జరిగింది. గరిడేపల్లి మండలం వెంకట రామ పురానికి చెందిన కుర్ర సైదులు పాప శ్రీజ, మరొకరు హుజూర్నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కుర్ర సైదులు, పాప శ్రీజ మృతి చెందారు. తీవ్రగాయాలు అయిన మరొక వ్యక్తి పరిస్థితి విషమం గా ఉండటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.