ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామంలో బీసీ లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో హద్దురాలను తొలగించి చదువుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ మాజీ సర్పంచ్ ముంత బాలస్వామి గ్రామ యాదవ్ నాయకులు వెంకట రాములు, ఖాదర్, రాము, నరసింహస్వామి, అంజి,టైగర్ రాములు తహశీల్దార్ తహశీల్దార్ కు, పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. గత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,ఇంచార్జి తాదార్ చక్రపాణి ఆధ్వర్యంలో గ్రామంలోని 65 మంది లబ్ధిదారులకు సర్వేనెంబర్ 361లో ఇండ్ల స్థలాలకు పట్టా సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. శుక్రవారం నుంచి వెళ్లిన వ్యక్తుల ప్రోత్సాహంతో ఛత్రపతి అనే వ్యక్తి జెసిబికి సహాయం చేశారన్నారు. అధికారికంగా ఇచ్చిన ప్లాట్‌ల లో హద్దురాలను తొలగించి చదువుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు.