ముద్ర,తెలంగాణ:-ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డి. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ.. అభివృద్ధి పథంలో సాగుదాం అని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సునామీ సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ చరిత్రలోనే ఇది అతిపెద్ద విజయం. అసెంబ్లీతో పాటు ఎంపీ స్థానాల్లోనూ కూటమి ప్రభంజనం సృష్టించింది. 8 జిల్లాల్లో అసలు వైసీపీ ఖాతా తెరవలేదు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 10 స్థానాలకు పడిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో…
విజయం సాధించిన
టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు గారికి,
జనసేన అధినేత
పవన్ కల్యాణ్ గారికి
నా అభినందనలు.ఇరు రాష్ట్రాల మధ్య
సత్సంబంధాలను కొనసాగిస్తూ…
సమస్యలను పరిష్కరించుకుంటూ…
అభివృద్ధి పథం వైపు సాగుదాం.@ncbn @పవన్ కళ్యాణ్– రేవంత్ రెడ్డి (@revanth_anumula) జూన్ 4, 2024