ముద్ర,ఆంధ్రప్రదేశ్:- 36వేలకు పైగా ఓట్ల తేడాతో నారా లోకేష్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ గెలుపొందారు ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారంపై చర్చలు మొదలయ్యాయి.
ప్రస్తుతం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. టీడీపీ విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు కూటమి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నార’ని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు.