ముద్ర,ఆంధ్రప్రదేశ్:-జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం పట్ల అభిమానులు, పార్టీ శ్రేణులే కాదు చిత్రసీమ ప్రముఖులు సైతం ఎంతో సంతోష పడుతున్నారు. చిత్రసీమలో అగ్ర హీరోగా రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సత్తా అవన్నీ వదిలేసి..గత పదేళ్లుగా రాజకీయాలు చేస్తూ..సొంత డబ్బును ప్రజలకు పంచిపెడుతూ వస్తున్న పవన్ ఈసారి ఖచ్చితంగా గెలవాలని కోరుకున్నారు. అందరి కోరిక మేరకు ఈరోజు పిఠాపురం నుండి 70 వేలఫై చిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.
తాజాగా టాలీవుడ్ హీరో వెంకటేష్ స్పందించారు. “ప్రియమైన పవన్ కల్యాణ్… చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలనే అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ వెంకీ ట్వీట్ చేశారు. అంతేకాదు… మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ అంటూ సరదాగా ఉంటుంది. వెంకటేశ్, పవన్ కల్యాణ్ గతంలో ‘గోపాలగోపాల’ అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అభినందనలు ప్రియతమా @పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయంపై!! నా మిత్రమా నీ కంటే దీనికి ఎవరూ అర్హులు కాదు. ???? మీరు మరింత ఎత్తుకు ఎదగండి మరియు ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి మరియు అంకితభావంతో స్ఫూర్తిని కొనసాగించండి. పిఠాపురం ఎమ్మెల్యే గారూ ♥️ మీకు శుభాకాంక్షలు
— వెంకటేష్ దగ్గుబాటి (@వెంకీమామ) జూన్ 5, 2024
అలాగే మహేష్ బాబు సైతం ..”పవన్ కల్యాణ్ గారూ… మీ అద్భుత విజయానికి అభినందనలు. ప్రజలు మీపై ఉంచిన నమ్మకం, విధేయతకు మీ విజయమే నిదర్శనం. ప్రజాసేవ దిశగా మీ కలలు సాకారం కావాలని, మీ పదవీకాలం విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఎక్స్ లో స్పందించారు.
మీ అద్భుతమైన విజయానికి అభినందనలు, @పవన్ కళ్యాణ్! ప్రజలు మీపై ఉంచిన విశ్వాసం మరియు విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం. మా ప్రజల కోసం మీ కలలను సాకారం చేయడంలో మీరు విజయంతో నిండిన పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను.
– మహేష్ బాబు (@urstrulyMahesh) జూన్ 5, 2024